| కీర్తనలు | త్యాగరాజు | రఘుపతే! రామ! రాక్షస భీమ! |
| శహాన - రూపకం |
| పల్లవి: |
| రఘుపతే! రామ! రాక్షస భీమ! ॥రఘు॥ |
| అను పల్లవి: |
| భృగు సుత మద హరణ ముని బృంద వందిత చరణ! ॥రఘు॥ |
| చరణము(లు): |
| సరసీరుహ నయన సజ్జన హృదయ నికేతన ధరణీధర ధరా! సీతా మనోహర నిరవధిసుఖదా ప్రమేయ నిరుపమ నారద సుగేయ కరధృతశరజాల నీలఘనవర్ణామరపాల ॥రఘు॥ |
| తరుణారుణ నిభచరణ తపవంశ విభూషణ వరుణాల యమద దమన వారణావన కరుణాకర గిరీశ చాపఖండన! నిర్జిత తాప పరిపూర్ణావతార! పరభామినీదూర ॥రఘు॥ |
| హరిహయపంకజ భవనుత పురవైరిపురా శరహిత నరవరవేష తారక నామధేయ స్వరజిత ఘనరవపరేశ శతభాస్కర సంకాశ పరిపాలిత త్యాగరాజ పాహి భక్త సమాజ ॥రఘు॥ |