| కీర్తనలు | త్యాగరాజు | రఘువర! నన్ను మరవ తగునా? |
| పంతువరాళి - ఆది |
| పల్లవి: |
| రఘువర! నన్ను మరవ తగునా? ॥రఘువర॥ |
| అను పల్లవి: |
| నగధర! భక్తనాఘ! నివారణ ॥రఘువర॥ |
| చరణము(లు): |
| తల్లి తండ్రు లన్న తమ్ములు యున్న పొలతికి యొక్కఁడు పురుషుఁడు యౌనా? ॥రఘువర॥ |
| పరదైవములు బాగు సొమ్ములు సురనుత! మంగళ సూత్రములౌనా ॥రఘువర॥ |
| జేసిన పుణ్యచయము బ్రహ్మణ్య ఆశనొసంగితి అనుపమ లావణ్య ॥రఘువర॥ |
| మనసున నీకే మరులు కొన్నాను స జ్జనహిత త్యాగరాజనుత శుభాకర ॥రఘువర॥ |