| కీర్తనలు | త్యాగరాజు | రాగ రత్న మాలికచే రంజిల్లునట, హరి |
| రీతిగౌళ - రూపకం |
| పల్లవి: |
| రాగ రత్న మాలికచే రంజిల్లునట, హరి శత ॥రాగ॥ |
| అను పల్లవి: |
| బాగ సేవించి సకల భాగ్య మొందుదాము రారే ॥రాగ॥ |
| చరణము(లు): |
| నైగమ షట్ఛాస్త్ర పురా ణాగమార్థ సహితమట యోగి వరులు యానందము నొందెడు సన్మార్గమట భాగవతోత్తములు గూడి బాడే కీర్తనములట త్యాగరాజు కడతేర తారకమని చేసిన శత ॥రాగ॥ |