| కీర్తనలు | త్యాగరాజు | రామ బాణత్రాణ శౌర్య |
| సావేరి - ఆది |
| పల్లవి: |
| రామ బాణత్రాణ శౌర్య మేమని పొగడుదురా ఓ మనసా రా.. |
| అను పల్లవి: |
| భామ కాసపడు రావణు మూల బలముల నేలఁగూలఁ జేయు రా.. |
| చరణము(లు): |
| తమ్ముఁడు బడలిన వేళ సురరిపు తెమ్మని చక్కెర బంచీయఁగఁ గని లెమ్మనుచును ఇంద్రారి బల్క సమ యమ్మని లేవఁగా సమ్మతితో నిలఁబడి కోదండపు జ్యాఘోషము లశనులఁ జేసి తా నెమ్మదిగల తోడును జూచెనురా నిజమైన త్యాగరాజనుతుఁడగు రా.. |