| కీర్తనలు | త్యాగరాజు | రామ రామ నీవారము గామా రామ సీతా |
| ఆనంద భైరవి - ఆది |
| పల్లవి: |
| రామ రామ నీవారము గామా రామ సీతా రా.. |
| అను పల్లవి: |
| రామ రామ సాధుజన ప్రేమ రారా రా.. |
| చరణము(లు): |
| మెఱుగుఁ జేలము గట్టుకో మెల్ల రారా రామ కఱకు బంగారు సొమ్ములు కదల రారా రా.. |
| వరమైనట్టి భక్తాభీష్ట వరద రారా రామ మఱుగుఁ జేసికొనే దట్టి మహిమ రారా రా.. |
| మెండైన కోదండకాంతి మెఱయ రారా కనుల పండువగ యుండు ఉద్దండ రారా రా.. |
| చిఱునవ్వుగల మోముఁజూప రారా రామ కరుణతో నన్నెల్లప్పుడు గావ రారా రా.. |
| కందర్పసుందరానందకంద రారా నీకు వందనము జేసెద గోవింద రారా రా.. |
| ఆద్యంత రహిత వేదవేద్యా రారా భవ వైద్య నీవాఁడనైతి వేగ రారా రా.. |
| సుప్రసన్న సత్యరూప సుగుణ రారా రామ అప్రమేయ త్యాగరాజునేలరారా రా.. |