| కీర్తనలు | త్యాగరాజు | రామ రామ రామ లాలి శ్రీరామ |
| శహన - చాపు |
| పల్లవి: |
| రామ రామ రామ లాలి శ్రీరామ రామ రామ లావణ్య లాలి ॥రా॥ |
| చరణము(లు): |
| దొరకరాని నిధిరారా దొరకు దొరవు నీవు తొట్లలో రారా ॥రా॥ |
| వరమైనట్టి వాపట్టిరారా వర సురులకు అరుదైన సుందర రారా ॥రా॥ |
| తొలిఁజేసిన నోము ఫలమా రామ ఇలను వెలయు ఇనకుల ధనమా ॥రా॥ |
| కలకలమని రావు చెంత ఆ కలి కొంటివో లేక కరుణాస్వాంత ॥రా॥ |
| మదగజ మన నా స్వామి ఓ సదయుఁడ నీ లోని జాలి దెల్పుమి ॥రా॥ |
| సరిబాలు లాడ రమ్మనిరి ఆడి వరద నీవు రావద్దు పొమ్మనిరి ॥రా॥ |
| ఎవరు నిన్ను ఏమనిరి రాఘవ నీ యెడ తప్పు కని రావద్దనిరి ॥రా॥ |
| కనులుమూసి యాడినారు కర మున కణఁగనినేత్రమని కసరెదరు ॥రా॥ |
| కలువరేకులను బోలు కనులు కలగనేల నన్నుగన్న దయాళో ॥రా॥ |
| నుదుటను శ్రమజలమేల ఆ కథయేమి దెలుపవే కరుణాలవాల ॥రా॥ |
| చింతచే దాగుదు వేఱే మేని కాంతిచే దాగుదు వేఱే మేని కాంతిచేఁ దగిలిన కర్మమనేరే ॥రా॥ |
| ముత్యాలసరుల చిక్కేమీ ఓ సత్యసంధ పాదసరుల నొక్కేమి ॥రా॥ |
| ముదమున నేపట్టు వేళనా పదమున నేపట్టు వేళనా పదమున వ్రాలెదరు పలుమాఱావేళ ॥రా॥ |
| నిన్నేమని బిల్చుకొనిరి రామ మన్ననతో నేమని యెంచుకొనిరి ॥రా॥ |
| బాగ సాక్షి రమ్మనిరి వర త్యాగరాజనుత దైవమాయనిరి ॥రా॥ |