| కీర్తనలు | త్యాగరాజు | రామ శ్రీరామ లాలీ ఊగుచు ఘన |
| శంకరాభరణము - ఆది |
| పల్లవి: |
| రామ శ్రీరామ లాలీ ఊగుచు ఘన శ్యామ ననుబ్రోవు లాలీ ॥రా॥ |
| చరణము(లు): |
| చాల పాలింతు లాలీ మీగడ వెన్న పాలు తాగింతు లాలీ శయ్యపైని మల్లె పూల బరతు లాలీ - వరమైన వి డేల నొసగె లాలీ - ఓ వనమాలీ ॥రా॥ |
| కాచి సేవింతు లాలీ శేషతల్పము నూచి పాడుదు లాలీ ఏకాంతమున దాచి పూజింతు లాలీ ఆవేళ నిన్ను జూచుచుప్పొంగే లాలీ - ఓ వనమాలీ ॥రా॥ |
| వేదవేద్యమా లాలీ - కన్నులఁ జూడ వే దయానిధి లాలీ - నాదురమున నీ పాదములుంచు లాలీ - శ్రీ త్యాగరాజ మోదరూపమా లాలీ - ఓ వనమాలీ ॥రా॥ |