| ఖరహరప్రియ - రూపకం |
| పల్లవి: |
| రామ! నీ సమాన మెవరు, రఘువంశోద్ధారక ॥రామ॥ |
| అను పల్లవి: |
| భామా మరువంపు మొలక! భక్తియను పంజరపు చిలుక ॥రామ॥ |
| చరణము(లు): |
పలుకు పలుకులకు తేనె యొలుక మాటలాడు సోద
రులుఁగల హరి త్యాగరాజ కులవిభూష! మృదు - సుభాష! ॥రామ॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - raama! nii samaana mevaru, raghuvaMshooddhaaraka ( telugu andhra )