| కీర్తనలు | త్యాగరాజు | రామఏవ దైవతం రఘుకులతిలకో మే |
| బలహంస - రూపక |
| పల్లవి: |
| రామఏవ దైవతం రఘుకులతిలకో మే రా.. |
| అను పల్లవి: |
| విగతకామమోహమదో విమలహృదయశుభఫలదో రా.. |
| చరణము(లు): |
| జిత గౌతమకృతశాపొ నతవరద సీతాపో రా.. |
| భక్తచిత్త తాపహరో భావుకదానచతురో రా.. |
| సురతారకగణచంద్రో మురనరకేభమృగేంద్రో రా.. |
| హరిపద్మజశర్వేశో హరిదశ్వ సుసంకాశో రా.. |
| త్యాగరాజహృత్సదనో నాగరాజవరశయనో రా.. |