| మధ్యమావతి - దేశాది |
| పల్లవి: |
| రామకథాసుధారసపానమొక రాజ్యము చేసునే రా.. |
| అను పల్లవి: |
భామామణి జానకి సౌమిత్రి
భరతాదులతో భూమి వెలయు సీతా రా.. |
| చరణము(లు): |
ధర్మాద్యఖిలఫలితమే మనసా
ధైర్యానంద సౌఖ్య నికేతనమే
కర్మబంధ జ్వలనాబ్ధినామమే
కలిహరమే త్యాగరాజవినుతుఁడగు రా.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - raamakathaasudhaarasapaanamoka raajyamu cheesunee ( telugu andhra )