| శుద్ధబంగాళ - ఆది |
| పల్లవి: |
| రామభక్తి సామ్రాజ్య - మేమానవుల కబ్బెనో మనసా ॥రా॥ |
| అను పల్లవి: |
| ఆ మానవుల సందర్శన - మత్యంత బ్రహ్మానందమే ॥రా॥ |
| చరణము(లు): |
ఈలాగని వివరింపలేను
చాల స్వానుభవవేద్యమే
లీలాసృష్టి జగత్త్రయ మనే
కోలాహల త్యాగరాజనుతుఁడగు ॥రా॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - raamabhakti saamraajya - meemaanavula kabbenoo manasaa ( telugu andhra )