| కీర్తనలు | త్యాగరాజు | రామా నీ యెడ ప్రేమరహితులకు |
| దిలీపక - దేశాది |
| పల్లవి: |
| రామా నీ యెడ ప్రేమరహితులకు నామరుచి తెలుసునా ఓ సీతా రా.. |
| అను పల్లవి: |
| కామినీవేసధారికి సాధ్వీ నడత లేమైనఁ దెలుసునా రీతి సీతా రా.. |
| చరణము(లు): |
| తన సౌఖ్యము తా నెఱుఁగక యొరులకు తగు బోధన సుఖమా ఘనమగు పులి గోరూపమైతే త్యా గరాజనుత శిశువుపాలు కల్గునా రా.. |