| కీర్తనలు | త్యాగరాజు | లక్షణములు గల శ్రీరామునికి ప్రదక్షిణ మొనరింతము రారే |
| శుద్ధసావేరి - ఆది |
| పల్లవి: |
| లక్షణములు గల శ్రీరామునికి ప్ర దక్షిణ మొనరింతము రారే ॥లక్షణములు॥ |
| అను పల్లవి: |
| కుక్షిని బ్రహ్మాండము లున్నవట వి చక్షణుఁడట దీక్షా గరుఁడట శుభ ॥లక్షణములు॥ |
| చరణము(లు): |
| లక్షణ లక్ష్యము గల శ్రుతులకు ప్ర త్యక్షం బౌనట శిక్షఁ బడి సభను మెప్పించు భక్త రక్షకుఁ డౌనట అక్షరస్తులయిన భజన పరులకే అంతరంగుఁ డౌనట సాక్షియై వెలయు త్యాగరాజ పక్షకుఁడౌనట ముప్పదిరెండు ॥లక్షణములు॥ |