| కీర్తనలు | త్యాగరాజు | లాలి లాలీయని యూచేరా వన |
| హరికాంభోజి - దేశాది |
| పల్లవి: |
| లాలి లాలీయని యూచేరా వన మాలి మాలిమితోఁ జూచేరా ॥లా॥ |
| చరణము(లు): |
| దేవ దేవయని బిలిచేరా మహాను భావ భావమునఁ దలచేరా ॥లా॥ |
| రామ రామ యని బలికేరా ని ష్కామ కామరిపునుత రారా ॥లా॥ |
| కోరి కోరి నినుఁ గొలిచేరా మాయా దారి దారి సద్భజనేరా ॥లా॥ |
| రాజ రాజ యని పొగడేరా త్యాగ రాజ రాజ యని మ్రొక్కేరా ॥లా॥ |