| నవనీత - ఆది |
| పల్లవి: |
| లేమిఁ దెల్పఁ బెద్ద లెవరు లేరో? ॥లేమి॥ |
| అను పల్లవి: |
| ఆ మహిమ లెల్ల మాని యీ మహిలోఁ బుట్టిరో ॥లేమి॥ |
| చరణము(లు): |
నీ రూపమునుఁ బూని మనసు నిర్మలులై యుండలేదా
ధారాధరాభ శరీర త్యాగరాజ వినుత ॥లేమి॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - leemi.r delpa.r bedda levaru leeroo? ( telugu andhra )