| కీర్తనలు | త్యాగరాజు | లోకావన చతుర! పాహి మాం |
| బేగడ - ఆది |
| పల్లవి: |
| లోకావన చతుర! పాహి మాం ॥లోకావన॥ |
| అను పల్లవి: |
| సాకేతాధిప సరస గుణాప్రమేయ సరసిజాసన సనందన వందితాంఘ్రి యుగ పద నిర్జిత ముని శాప ॥లోకావన॥ |
| చరణము(లు): |
| రాకాబ్జముఖ పరాకా చెంతకు రాక తనకోర్వ తరమా పాకారి వినుత నీకాశించితి గాక నే నన్య మెంచను నీదు వాఁడనయ్య రామయ్య ॥లోకావన॥ |
| నీలాకృతి గల నీ లావణ్యము నీలాగని కనిపింపవే బాలార్కాభ సు చేలావృత నన్నేలుకో మనసు రాదిక తాళజాల న్యాయామారామ ॥లోకావన॥ |
| చాపాదిక పరి రూపాలను గొను చాపాలంకృత సుందర అవనీ పాద్భుతమగు నీ పాదము గతి శ్రీపతే వర ద పాలిత త్యాగరాజ సార్వభౌమాఖిల ॥లోకావన॥ |