| కీర్తనలు | త్యాగరాజు | వరదరాజ! నినుఁ గోరి వచ్చితి మ్రొక్కేరా |
| స్వరభూషణి - రూపక |
| పల్లవి: |
| వరదరాజ! నినుఁ గోరి వచ్చితి మ్రొక్కేరా వ.. |
| అను పల్లవి: |
| సురలు మునులు భూసురులు చుట్టి చుట్టి సేవించే వ.. |
| చరణము(లు): |
| వరగిరి వైకుంఠమట వర్ణింపఁదరముగాదట నిర్జనులకు తారకములలోఁ జంద్రుఁడై మెఱయుఁదువట వర త్యా గరాజనుత గరుడసేవఁ జూడ వ.. |