| కీర్తనలు | త్యాగరాజు | వరదా! నవనీతాశ! పాహి, వరదానవ మదనాశా! ఏహి |
| రాగపంజరం - చాపు |
| పల్లవి: |
| వరదా! నవనీతాశ! పాహి వరదానవ మదనాశా! ఏహి ॥వరదా॥ |
| అను పల్లవి: |
| శరదాభ! కరధృత శరా శర దాశుగ! సుమశరదాశ రహిత! ॥వరదా॥ |
| చరణము(లు): |
| ద్విరదాద్భుతగమన! పురదహననుత! స్ఫురదాభరణా! జరావనపర! గరదాశన తురగరథా! ద్యుతిజిత వరదాస జనాగ్రేసర త్యాగరాజ ॥వరదా॥ |