| విజయశ్రీ - ఆది |
| పల్లవి: |
వరనారద నారాయణ
స్మరణానందానుభవముగల వ.. |
| అను పల్లవి: |
శరదిందు నిభాపఘనానఘ
సారముగాను బ్రోవు మిఁక వ.. |
| చరణము(లు): |
సకలలోకములకు సద్గురువనుచు
సదా నే నతఁడనుచు హరియు
ప్రకటంబుగఁ గీర్తి నొసంగెనే
భావుక త్యాగరాజనుత వ.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - varanaarada naaraayaNa ( telugu andhra )