| చెంచుకాంభోజి - దేశాది |
| పల్లవి: |
| వరరాగలయజ్ఞులు దామనుచు వదరెరయా ॥వర॥ |
| అను పల్లవి: |
స్వర జాతి మూర్ఛన భేదములు
స్వాంతమందు దెలియక యుండిన ॥వర॥ |
| చరణము(లు): |
దేహోద్భవంబగు నాదములు
దివ్యమౌ ప్రణవాకార మను
దాహం బెఱుఁగని మానవులు
త్యాగరాజనుత యేచెదరు రామ ॥వర॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - vararaagalayaGYulu daamanuchu vadarerayaa ( telugu andhra )