| కీర్తనలు | త్యాగరాజు | వరాలందుకొమ్మని నాయందు వంచన సేయ న్యాయమా? |
| ఘుర్జరి - ఆది |
| పల్లవి: |
| వరాలందుకొమ్మని నాయందు వంచన సేయ న్యాయమా? ॥వ॥ |
| అను పల్లవి: |
| సురాసురవినుత! రామ! నా మన సు భక్తినిఁ గోరి యుండగ నను ॥వ॥ |
| చరణము(లు): |
| మనమున నిజముగ నమ్మిన వారి మనసు కొంచ ఫలమాశించగ రా దనుచు - ఘనుని జేసిన నీ బిరుదుకు కనక కశిపు సుతుఁడు సాక్షి గాదా? ॥వ॥ |
| అవివేకముతో దెలిసి తెలియకను భవసుఖముల కాశించిన గాని ధ్రువమైన ఫలమొసంగు నీ శక్తికి ధ్రువుఁడు సాక్షిగాదా? రామ నను ॥వ॥ |
| చరాచరాత్మక! సురపూజిత! యిక పరాకులేకయు సతతము నీ ద య రావలె ననుచు కోరి శ్రీ త్యా గరాజునిపై గృపలేక నను ॥వ॥ |