| కీర్తనలు | త్యాగరాజు | వాఁడేరా దైవము మనసా |
| పంతువరాళి - ఆది |
| పల్లవి: |
| వాఁడేరా దైవము మనసా ॥వా॥ |
| అను పల్లవి: |
| ఆడిన మాటలు తప్పఁ డనుచును ఆచంద్రార్కముగ కీర్తిగల్గిన ॥వా॥ |
| చరణము(లు): |
| దండి రక్కసుల మదమణఁచను ఆ ఖండలాది సురకోటులను భూ మండల సుజనులఁ బాలింపను గో దండపాణి రూపముతో వెలసిన ॥వా॥ |
| దారితెలియలేని అజ్ఞులకు భవ నీరధి దాటి మోక్షమందుటకు నీరజారిధరుఁ డుపదేశించే తారక నామముతోను వెలసిన ॥వా॥ |
| ధాతృ వినుతుఁడైన త్యాగరాజుని చేతి పూజలంది బాగుగ ప్ర ద్యోతనాన్వయమునను జనించి సీతాపతియని పేరుకలిగిన ॥వా॥ |