| కీర్తనలు | త్యాగరాజు | వాసుదేవ యని వెడలిన యీ దౌవారికుని గనరే |
| కల్యాణి - ఆది |
| పల్లవి: |
| వాసుదేవ యని వెడలిన యీ దౌవారికుని గనరే వా.. |
| అను పల్లవి: |
| వాసవాది సురపూజితుఁడై వారిజనయనుని మదినిదలఁచుచును వా.. |
| చరణము(లు): |
| నీరుకావి దోవతులను గట్టి నిటలమునను శ్రీచూర్ణముఁ బెట్టి నారి వెడలి యీ సభలోఁ జుట్టి సారెకు బంగరు కోలను బట్టి వా.. |
| మాటిమాటికిని మీసము దువ్వి మన్మథరూపుఁడు తానని క్రొవ్వి దాటి దాటి పడుచును తానివ్వి ధంబునఁ బలుకుచు పకపక నవ్వి వా.. |
| బాగుమీర నటనము చేయుచును పతితపావనుని తా వేఁడుచును రాగతాళగతులను బాడుచును త్యాగరాజసన్నుతుని బొగడుచును వా.. |