| కీర్తనలు | త్యాగరాజు | విధి శక్రాదులకు దొరుకునా? ఇటువంటి సన్నిధి వేడుక జూతాము రారె |
| యమునాకల్యాణి - రూపకం |
| పల్లవి: |
| విధి శక్రాదులకు దొరుకునా? ఇటువంటి స న్నిధి వేడుక జూతాము రారె ॥విధి॥ |
| అను పల్లవి: |
| సుధీజనరక్షకి ధర్మాం - బుధిశాయి సేవ జూడ ॥విధి॥ |
| చరణము(లు): |
| ఉడుపతి ముఖులెల్ల వరుసగా బిరుదులనుఁబట్టి అడుగడుగు జయజయ యనగా యా వేల్పులవేల పడుచులు నిజ నాట్యమాడగా సమయమున పసిడి సుమవర్షము గురియగ వడివడిగ సమరకోటులు తడతడ భూమిని దండములిడగా సం తోషమునను కడకంటిని జూచు సొగసు ॥విధి॥ |
| శ్రీరమణిజూచి పల్కగ నవరత్నాల హారపు సురు లల్లాడగ ఆ మొలక నగవు గౌరవము అంతటను మెరయగ నావేళ సనక నారదాదులెల్లఁ బొగడగా కీరమునను బూని సరిగ చీర కాంతి మెరయగా శృంగారి కొలువు యుండు శుక్ర వారపు సొగ సెల్ల జూడ ॥విధి॥ |
| తరుణారుణ వదన కమలిని అత్యంతమైన కరుణారస పూర్ణ నేత్రిని శ్రీపంచనద మెరయు కంకణయుతకర పర దేవిని సేవింప ॥విధి॥ |