| దేవగాంధారి - దేశాది |
| పల్లవి: |
| వినరాద నా మనవి వి.. |
| అను పల్లవి: |
కనకాంగ కావేటిరంగ శ్రీకాంత
కాంతలెల్లఁ గామించి పిలిచితే వి.. |
| చరణము(లు): |
తేజినెక్కి బాగ తెరువున రాగ
రాజసతులు చూచి రమ్మని పిలిచితే వి.. |
భాగధేయ వైభోగరంగ శ్రీ
త్యాగరాజనుత తరుణులు పిలిచితే వి.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - vinaraada naa manavi ( telugu andhra )