| కీర్తనలు | త్యాగరాజు | వినుతాసుతవాహన శ్రీరమణ - మనసారఁగ సేవించెద రామ |
| జయంతసేన - ఆది |
| పల్లవి: |
| వినుతాసుతవాహన శ్రీరమణ - మనసారఁగ సేవించెద రామ ॥వి॥ |
| అను పల్లవి: |
| నిను సారెకుఁ జూడని బ్రతుకేలే - మనుజుల నే చే జీవనమేలే ॥వి॥ |
| చరణము(లు): |
| మతభేదమనే శకనాస్తిక స - మ్మతవాక్కులు బల్కుట సుఖమా క్షితిలో సత్సంగతి సౌఖ్యము పా - లిత త్యాగరాజామరపాల ॥వి॥ |