| కుంతలవరాళి - ఆది |
| పల్లవి: |
| శరశరసమరైకసూర శరధిమదవిదార శ.. |
| అను పల్లవి: |
సురరిపు మూలబల మనుదూల
గిరుల కనలసమమౌ శ్రీరామ శ.. |
| చరణము(లు): |
తొలిఁజేసిన పాపవన కుఠారమా
కలనైన సేయఁగ లేని
బలువిలును విఱచి వెలసిన శ్రీరఘు
కులవర బ్రోవుము త్యాగరాజనుత శ.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - sharasharasamaraikasuura sharadhimadavidaara ( telugu andhra )