| కీర్తనలు | త్యాగరాజు | శశి వదన, భక్త జనావన, శంకర, నే తాళ గలనా? |
| చంద్రజ్యోతి - ఆది |
| పల్లవి: |
| శశి వదన, భక్త జనావన, శంకర, నే తాళ గలనా? ॥శశి॥ |
| అను పల్లవి: |
| పసితనమందే మునియాగమున నీ బాహుపరాక్రమము నెఱుగనా రాకా ॥శశి॥ |
| చరణము(లు): |
| దిన దిన మౌపాసన జప తప ధ్యానమను యోగము వేళ మనసున బుట్టిన ఘన డంభుని తోడను మారీచుఁడు పని చెఱచిన యీ త్యాగరాజర్చిత ॥శశి॥ |