| కీర్తనలు | త్యాగరాజు | శివశివ యనరాదా ఓరీ |
| పంతువరాళి - ఆది |
| పల్లవి: |
| శివశివ యనరాదా ఓరీ శివ.. |
| అను పల్లవి: |
| భవభయబాధల నణచుకోరాదా శివ.. |
| చరణము(లు): |
| కామాదుల దెగకోసి పర భామల పరుల ధనముల రోసి పామరత్వము నెడబాసి అతి నీమముతో బిల్వార్చన జేసి శివ.. |
| సజ్జనగణముల గాంచి ఓరి ముజ్జగదీశ్వరులని మతి నెంచి లజ్జాదుల దొలగించి తన హృజ్జలజమునను తా పూజించి శివ.. |
| ఆగమముల నుతియించి బహు బాగులేని భాషలు చాలించి భాగవతులతో పోషించి ఓరి త్యాగరాజ సన్నుతుడని యెంచి శివ.. |