| కీర్తనలు | త్యాగరాజు | శివే పాహి మా మంబికే! శ్రితఫలదాయకి |
| కల్యాణి - ఆది |
| పల్లవి: |
| శివే పాహి మా మంబికే! శ్రిత ఫలదాయకి ॥శివే॥ |
| అను పల్లవి: |
| కావేరిజోత్తర తీరవాసిని కాత్యాయని ధర్మ సంవర్ధని ॥శివే॥ |
| చరణము(లు): |
| స్వభావమౌ నీ ప్రభావము మహా నుభావురాలైన భారతికి పొగ డ భారమై యుండ భావజారా తిభామ నే నెంత? భాగ్యదాయకి ॥శివే॥ |
| కలార్థమిది శశికలాధరి యుప వలారి మాయా విలాసిని స కలాగమనుతె బలారి యన శుభ ఫలా లొసగు పరమ లాలనమ్మున ॥శివే॥ |
| చరాచరమయి కరారవిందము న రామ చిలుకను బిరాన బూని పరాకు జూడరాదు శ్రీరఘు వరాప్తుఁడగు త్యాగరాజ వినుతే ॥శివే॥ |