| కీర్తనలు | త్యాగరాజు | శోభానే |
| పంతువరాళి - త్రిపుట |
| పల్లవి: |
| శోభానే ॥శోభానే॥ |
| అను పల్లవి: |
| వదన ద్యుతిజిత సోమ వసుధ మానవ కామ మదమానవ గణభీమ మాం పాహి శ్రీరామ ॥శోభానే॥ |
| చరణము(లు): |
| జనక సుతా హృద్రమణ జమదగ్నిజ మదహరణ ప్రణతాఘానల వరుణ పాహిమాం మునిశరణ ॥శోభానే॥ |
| విగళిత మోహాపాశ విధు కోటి సంకాశ భగవన్ సకలాధీశ పాహి పాప వినాశ ॥శోభానే॥ |
| వర త్యాగరాజనుత వారిద సంభవ తాత పరమ కల్యాణ యుత పాహి మాం శుభ చరిత్ర ॥శోభానే॥ |