| కీర్తనలు | త్యాగరాజు | శోభానే |
| పంతువరాళి - త్రిపుట |
| పల్లవి: |
| శోభానే ॥శో॥ |
| అను పల్లవి: |
| వదనద్యుతిజితసోమ - వసుధామానసకామ మదమానవగణభీమ - మాం పాహి శ్రీరామ ॥శో॥ |
| చరణము(లు): |
| జనకసుతా హృద్రమణ - జమదగ్నిజ మదహరణ ప్రణతాఘానలవరున - పాహిమాం మునిశరణ ॥శో॥ |
| విగళిత మోహపాశ - విధుకోటి సంకాశ భగవన్ సకలాధీశ - పాహి పాపవినాశ ॥శో॥ |
| వరత్యాగరాజనుత - వారిజసంభవతాత పరమకల్యాణయుత - పాహి మాం శుభచరిత ॥శో॥ |