| జగన్మోహిని - రూపకము |
| పల్లవి: |
| శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనసా ॥శో॥ |
| అను పల్లవి: |
| నాభి హృత్కంఠ రసన నాసాదులయందు ॥శో॥ |
| చరణము(లు): |
ధర ఋక్సామాదులలో వరగాయత్రీ హృదయమున
సుర భూసుర మానసమున శుభ త్యాగరాజాదులలో ॥శో॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - shoobhillu saptasvara suMdarula bhajiMpavee manasaa ( telugu andhra )