| కీర్తనలు | త్యాగరాజు | శ్రీ తులశమ్మ మాయింట నెలకొనవమ్మ |
| దేవగాంధారి - ఆది |
| పల్లవి: |
| శ్రీ తులశమ్మ మాయింట నెలకొనవమ్మ శ్రీ.. |
| అను పల్లవి: |
| ఈ మహిని నీ సమానమెవరమ్మ బంగారుబొమ్మ శ్రీ.. |
| చరణము(లు): |
| కఱకు సువర్ణపు సొమ్ములుబెట్టి సరిగచీర ముద్దుగురియఁగఁ గట్టి కరుణఁజూచి సిరులను ఒడిగట్టి వరదునిఁ గరమునను బట్టి శ్రీ.. |
| ఉరమున ముత్యపు సరులసియాడ సురతరుణులు నిన్నుఁ గని కొనియాడ వరమునులష్టదిగీశులు వేడ వరదుఁడు నినుఁ బ్రేమఁ జూడ శ్రీ.. |
| మరువక పారిజాత సరోజ కురువక వకుళ సుగంధరాజ వరసుమములచే త్యాగరాజ వరద నినుఁ బూజసేతు శ్రీ.. |