| కీర్తనలు | త్యాగరాజు | శ్రీనారద! నాద సరసీరుహ భృంగ, శుభాంగ |
| కానడ - రూపకం |
| పల్లవి: |
| శ్రీనారద! నాద సరసీరుహ భృంగ, శుభాంగ ॥శ్రీ॥ |
| అను పల్లవి: |
| దీనమానరక్షక! జగదీశ! భేష సంకాశ ॥శ్రీ॥ |
| చరణము(లు): |
| వేద జనిత వర వీణా వాదన తత్త్వజ్ఞ! ఖేదకర త్రితాప రహిత! ఖేచర వినుత! యాదవ కులజాప్త! సదా మోద హృదయ మునివర్య! శ్రీద త్యాగరాజ వినుత! శ్రీకర! మాం పాలయ ॥శ్రీ॥ |