| నాగస్వరావళి - ఆది |
| పల్లవి: |
శ్రీపతే! నీ పద
చింతన జీవనము ॥శ్రీపతే॥ |
| అను పల్లవి: |
నే పరదేశి నా గాసి
బాపవే చనువున దయ జేసి ॥శ్రీపతే॥ |
| చరణము(లు): |
రాజాధిరాజ! రవికోటి తేజ!
పూజించి నిన్నింద్రాదులు ది
గ్రాజులై వెలయ లేదా!
రాజిల్లు శ్రీ త్యాగరాజునికి ॥శ్రీపతే॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - shriipatee! nii pada chiMtana jiivanamu ( telugu andhra )