| హంసధ్వని - దేశాది |
| పల్లవి: |
శ్రీరఘుకులమందుఁ బుట్టి
సీతను జేకొనిన రామచంద్ర ॥శ్రీ॥ |
| అను పల్లవి: |
ఆరామ మందు మునుల కోరిక
లీడేరసేయఁ బూనుకొన్న రామ ॥శ్రీ॥ |
| చరణము(లు): |
వరరత్న పీఠమందు మజ్జనము
పుడమి సురలచేతఁ గైకొన్న రామ
పరమభక్తులను బాలనము సేయు
సాకేతవాస త్యాగరాజనుత ॥శ్రీ॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - shriiraghukulamaMdu.r buTTi ( telugu andhra )