| కీర్తనలు | త్యాగరాజు | శ్రీరఘువర సుగుణాలయ |
| భైరవి - ఆది |
| పల్లవి: |
| శ్రీరఘువర సుగుణాలయ సరసిజలోచన విరోచనాభ ॥శ్రీ॥ |
| చరణము(లు): |
| తరానలేని పరాకులేటికి బిరాన ననుఁ బ్రోవఁగరాదా వాదా ॥శ్రీ॥ |
| కమలాహిత నత కమలాహిత ధర మమతఁదెలిసి నను మన్నించరాదా ॥శ్రీ॥ |
| కలశజలధిలో లక్ష్మితోనాడే కలకాలమున నీ సేవరాఁజేసే నామనసెఱింగి బల్కు మిఁకను ॥శ్రీ॥ |
| కనికరమున ననుకని కరమున నిడి చనువున నొక మనవిని బల్కరాదా ॥శ్రీ॥ |
| ఆగమమూల అవనిజాలోల వేగమే దెలిసికో త్యాగరాజార్చిత ॥శ్రీ॥ |