| కీర్తనలు | త్యాగరాజు | సందేహమును దీర్పుమయ్య, సాకేత నిలయ, రామయ్య |
| రామప్రియ - దేశాది |
| పల్లవి: |
| సందేహమును దీర్పుమయ్య, సాకేత నిలయ, రామయ్య ॥సందేహమును॥ |
| అను పల్లవి: |
| నందార్చిత పరయుగములు మేలో నాగరీకమగు పాదుకా యుగంబులు మేలో ॥సందేహమును॥ |
| చరణము(లు): |
| వర మౌనులెల్ల చరణంబులను స్మరియింప నీవు వర మొసంగక భరతార్చనచే పాదుకలు ధరణి నిన్నొసగె త్యాగరాజ భాగ్యమా ॥సందేహమును॥ |