| గంభీరవాణి - దేశాది |
| పల్లవి: |
సదా మదిన్ దలతు గదరా
ముదాస్పద నగజాధిపతే స.. |
| అను పల్లవి: |
సదా శివానంద స్వరూప
సదయమోదహృదయ పదసరోజములనే స.. |
| చరణము(లు): |
దిగంబరాంధక దైత్యహర
దిగీశ సన్నుత గంగాధర
మృగాంకశేఖర నటన చతుర
మనుపసమయమిదిరా త్యాగరాజ వినుత స.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - sadaa madin dalatu gadaraa ( telugu andhra )