| శ్రీరంజని - దేశాది |
| పల్లవి: |
| సరియెవ్వరే శ్రీ జానకి నీ స.. |
| అను పల్లవి: |
పరమాత్మునికై గడదేరి సదా
సిరులిచ్చుటకు చేరి గొలిచిన నీ స.. |
| చరణము(లు): |
వనమందు భయంకరమైన తా
వున నిల్తునని మనసుఁ దెలిసి
కనకాంగి యందందున రాజసుఖం
బును కల్గఁజేసితెవె త్యాగరాజనుత స.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - sariyevvaree shrii jaanaki nii ( telugu andhra )