| భిన్నషడ్జమమ్ - దేశాది |
| పల్లవి: |
| సరివారిలోన చౌక చాలదాయెనా స.. |
| అను పల్లవి: |
పొరుగిండ్లు వారలచేతి పూజ
చూచిచూచి చల్లనాయెనా స.. |
| చరణము(లు): |
తారుమారుగ బల్కు వారిలు
తత్తరించగ జూడ న్యాయమా
పారమార్థికుల దుఃఖజాలముల
బాపలేదా శ్రీత్యాగరాజనుత స.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - sarivaariloona chauka chaaladaayenaa ( telugu andhra )