| హిందోళము - ఆది |
| పల్లవి: |
సామజవరగమన సాధుహృ
త్సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత ॥సా॥ |
| అను పల్లవి: |
సామనిగమజ సుధామయ గాన విచక్షణ
గుణశీల దయాలవాల మాం పాలయ ॥సా॥ |
| చరణము(లు): |
వేదశిరోమాతృజ సప్తస్వర
నాదాచలదీప స్వీకృత
యాదవకుల మురళీవాదన వి
నోద మోహనకర త్యాగరాజ వందనీయ ॥సా॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - saamajavaragamana saadhuhR^i ( telugu andhra )