| కీర్తనలు | త్యాగరాజు | సారమేగాని యన్యమార్గవిచార మేటికే ఓ మనసా |
| పంతువరాళి - చాపు |
| పల్లవి: |
| సారమేగాని యన్యమార్గ వి చార మేటికే ఓ మనసా ॥సారమేగాని॥ |
| అను పల్లవి: |
| వారు వీరుఁ దెలియ లేక బల్కెడు వార్తలు విననేలే రామ నామము ॥సారమేగాని॥ |
| చరణము(లు): |
| మారకోటి లావణ్యుఁడైన రఘు వీరుని నామ సుధారసమునను సారెకుఁ బానముఁ జేసి జగద్వి హారుఁడై వెలసెడు నారాయణ నారాయణ యనుచును వారము శరదంబుద నిభుఁడౌ శ్రీ నారదముని వల్మీక జాతునికిఁ గూరిమి నుపదేశించ లేదా ॥సారమేగాని॥ |
| పరమపావనుని శరణాగత జన పరిపాలన బిరుదాంకుని సీతా వరుని నామ సుధారస పానము నిరతమునను జేసి హరి హరి హరి యనుచు సంతతంబును సరియు లేని కీర్తి గాంచి దేహము పరవశంబు జెంది శుకబ్రహ్మ పరీక్షిత్తు కొసగలేదా వారా ॥సారమేగాని॥ |
| సామగాన లోలుఁడౌ రజితగిరి ధాముఁడైన త్యాగరాజ శివుఁ డతి నేమముతో నామామృతము పానము యేమరకను జేసి రామ రామ రామ యనుచును సతతము శ్రీమదాది గౌరికి శృంగారికి నా మహిమల నా రహస్యముల నతి ప్రేమను నుపదేశింప లేదా ॥సారమేగాని॥ |