| కీర్తనలు | త్యాగరాజు | సీతమ్మ మాయమ్మ శ్రీరాముఁడు మాతండ్రి |
| లలిత - రూపకము |
| పల్లవి: |
| సీతమ్మ మాయమ్మ శ్రీరాముఁడు మాతండ్రి ॥సీ॥ |
| అను పల్లవి: |
| వాతాత్మజ సౌమిత్రి వైనతేయ రిపుమర్దన ధాత భరతాదులు సోదరులు మాకు ఓ మనసా ॥సీ॥ |
| చరణము(లు): |
| పరమేశ వశిష్ఠ పరాశర నారద శౌనక శుక సురపతి గౌతమ లంబోదర గుహ సనకాదులు ధర నిజ భాగవతాగ్రేసరు లెవరో వారెల్లను వర త్యాగరాజునికి పరమబాంధవులు మనసా ॥సీ॥ |