| కీర్తనలు | త్యాగరాజు | సీతానాయక శ్రితజనపోషక శ్రీరఘుకులతిలక ఓ రామ |
| రీతిగౌళ - చాపు |
| పల్లవి: |
| సీతానాయక శ్రితజనపోషక శ్రీరఘుకులతిలక ఓ రామ ॥సీతా॥ |
| చరణము(లు): |
| నిరుపేద భక్తుల కరితోత బడలేక గిరిపై నెక్కుకొంటివో ॥సీతా॥ |
| అంగలార్పు జూచి రంగపురమున చె లంగుచు పండితివో ॥సీతా॥ |
| గాచిన భక్తుల జూచి యాబలిని యాచించ వెడలితివో ॥సీతా॥ |
| ఆశమించి నిన్నాశుజేరెద రని కీశుల జేరితివో ॥సీతా॥ |
| జాలితోవచ్చు కుచేలుని కని గోపి చేలము లెత్తితివో ॥సీతా॥ |
| ఇంగిత మెఱిఁగి యుప్పొంగుచు బ్రోచు బంగారు దొరవైతివో ॥సీతా॥ |
| నీ గుణములు గుట్టు బాగుగ దెలిసెను త్యాగరాజ వినుత ॥సీతా॥ |