| కీర్తనలు | త్యాగరాజు | సీతామనోహర, శృంగార శేఖర |
| రామమనోహరి - ఆది |
| పల్లవి: |
| సీతామనోహర, శృంగార శేఖర ॥సీతా॥ |
| అను పల్లవి: |
| వాతాశనారి వరవాహన వారిజాసనాది సన్నుతపద ॥సీతా॥ |
| చరణము(లు): |
| తొలి జన్మముల నే జేసిన పూజా ఫలమో లేక నీదు కటాక్ష బలమో నీవాడను నేనని లోకులు బల్కగా ధన్యుఁడ నైతిని ॥సీతా॥ |
| దీనలోక సంరక్షక దైవా ధీనము గాదు నీ రూపము నాదు మానసమున నాటి యుండగ నే నెంతటి భాగ్యశాలినో ॥సీతా॥ |
| దిట్ట తనమునను భక్తి స్థిరమౌ నట్టుగా శ్రీరామ యెన్నటికిఁ గట్టిగాను త్యాగరాజుని చై బట్టి రక్షించి యేలుకోవయ్య ॥సీతా॥ |