| కీర్తనలు | త్యాగరాజు | సుందరి నీదివ్యరూపమును |
| కల్యాణి - ఆది |
| పల్లవి: |
| సుందరి నీదివ్యరూపమును జూఁడ దనకు దొరికెనమ్మ సుం.. |
| అను పల్లవి: |
| మందగమన నీ కటాక్షబలమో ముందటి పూజాఫలమో త్రిపుర సుం.. |
| చరణము(లు): |
| భువిలో వరమౌ శ్రీమదాది పురమున నెలకొన్న నీ సొగసువిని సువివేకులైన బ్రహ్మాది సురలు గుంపుగూడి కవివాసరపు సేవ కనుంగొన కలుగునా యనికరఁగుచు మదిలో దివి దత్తరము పడుచు నుండఁగా దీనజనార్తి హారిణి త్రిపుర సుం.. |
| కలిలో దీనరక్షకి యని సభ కలిగిన తావునఁ బొగడుదునమ్మా సలలితగుణకరుణాసాగరి నీ సాటి యెవరమ్మా అలసివచ్చినందుకు నామనసు హాయి చెందునా యని యుండఁగ మఱి కలకలమని సురసతులు వరుసగాఁ గొలుచు శుక్రవారపు ముద్దు త్రిపుర సుం.. |
| నన్నుఁ గన్నతల్లి నా జన్మము నాఁడు సఫలమాయెనమ్మా ఇపుడు ఘనదరిద్రునికి పైకమువలెఁ గనుల పండువుగా వనజనయన ఎండుపైరులపై జలము వలె శుభదాయకి కామ జనకుని సోదరి శ్రీ త్యాగరాజ మనోహరి గౌరి సుం.. |