| కానడ - దేశాది |
| పల్లవి: |
| సుఖియెవరో రామనామ ॥సు॥ |
| అను పల్లవి: |
సుఖియెవరో సుముఖియెవరో
అఖిలసారమగు తారకనామ ॥సు॥ |
| చరణము(లు): |
సత్యము తప్పక సకల లోకులకు
భృత్యుఁడై దైవ భేదము లేక
నిత్యమైన సుస్వరగానముతో
నిరంతరము త్యాగరాజనుత నామ ॥సు॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - sukhiyevaroo raamanaama ( telugu andhra )