| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | పలుకదేమిర రామ నాతో |
| దేవమనోహరి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| పలుకదేమిర రామ నాతో పలికితె నీదేమి సొమ్ములు పోవునా॥ |
| అనుపల్లవి: |
| జలజసంభవ భవాద్యమరవినుతపద జలజనయన నీవు సుముఖుడై వేగమె॥ |
| చరణము(లు): |
| నిరవధి సుఖదాయకుడని దెలిసి నే నే నిరతము నిజముగ నమ్మియుండగ॥ |
| మరచితివేమో మరవకురా రామ గరుడగమన వాసుదేవ దయానిధే॥ |